'ఖైదీ' సినిమాకి 38 ఏళ్ళు... 'చిరు' కానుక!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'ఖైదీ' ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.. 28 అక్టోబర్, 1983లో విడుదలైన ఈ చిత్రం రికార్డులను తిరగరాసి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఈ సినిమా విడుదలై 38 ఏళ్లు పూర్తయింది. నేటీకీ 'ఖైదీ'ది చెక్కుచెదరని స్థానమే.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిపిన ఈ 'ఖైదీసకి అభిమానులు ఇచ్చే 'చిరు' కానుకగా ఈ సెలెబ్రేషన్స్ నిలుస్తున్నాయి.
ఖైదీ 28 అక్టోబర్ 1983న ఖైదీ విడుదలై, బాక్సాఫీసును బద్దలు కొట్టింది. ఈ చిత్రం వాణిజ్యపరంగా భారీ విజయాన్ని సాధించింది, దీని ద్వారా చిరంజీవి స్టార్‌డమ్‌కి ఎదిగారు. ఆ తర్వాత చిరు వెనుదిరిగి చూడాల్సిన అవసరం కలగలేదు. ఆయన అభిమన సంఘం అంతగా, అంచెలంచెలుగా ఎదిగిపోయి...చిరును మెగాస్టార్ ని చేసేశారు. ఈ రోజుకు కూడా ఖైదీ స్టిల్స్ చిరంజీవిలోని ప్రత్యేక గెటప్ లను దర్శనమిస్తాయి. పోలీస్ స్టేషన్ సెల్ నుంచి బయటపడి... పోలీసులతో స్టేషన్లో భీకర ఫైట్ చేసి పరారవడం ఖైదీ సినిమా ఓపనెంగ్ సీన్... ఇది అప్పటి యూత్ లో ఎంతో ఉద్రేకాన్ని, చిరు పట్ల వీరాభిమానాన్ని కలిగించాయి. ఆ తర్వాత అన్ని సీన్లూ ఖైదీలో హైలైటే.