మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (16:32 IST)

పవన్ ఫ్యాన్సుకు చేదువార్త -మరోసారి సినిమాలకు పవర్ స్టార్ దూరం

పవర్ స్టార్ పవన్ సినిమాల్లోకి మళ్ళీ రావడంతో సంతోషంగా ఉన్న మెగా ఫ్యాన్స్‌కు ఓ చేదు వార్త. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో చాలా చురుకుగా ఉన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
జనసేనాని తన రాజకీయ పార్టీని నడపడానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో విన్పిస్తున్న టాక్ ప్రకారం పవన్ ఇకపై సినిమాలకు సంతకం చేయకూడదని నిర్ణయించుకున్నారట.
 
ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి సినిమాల నుంచి బ్రేక్ తీసుకోనున్నారు. 2023 నుంచి రాబోయే ఎన్నికలపై దృష్టి సారించాలని భావిస్తున్నారట. మరి ఈసారైనా ఏపీ ఎన్నికల్లో పవన్ జగన్ ప్రభుత్వానికి గట్టి పోటీ ఇవ్వడం కోసం సిద్ధం అవుతున్నారట. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. 
 
పొలిటికల్ ఎంట్రీ అనంతరం సినిమాలను దూరం పెట్టిన పవన్ 'వకీల్ సాబ్'తో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా భారీ కలెక్షన్స్ రాబట్టింది. 'వకీల్ సాబ్'తో పాటు ఆయన వరుసగా మేకర్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. 
 
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్', 'హరిహర వీరమల్లు', 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమాలు చేస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డితో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి.