ఎన్నికల్లో ఎవరికీ సపోర్ట్ చేయలేదు; మోహన్‌బాబు స్నేహితుడేః చిరంజీవి
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఇటీవలే అక్టోబర్ 10వ తేదీన జరిగాయి. పూర్తి పోలీసు బంధోబస్తు మధ్య ఇరుపేనల్ గొడవలు, కొరుక్కోవడాలు, తిట్టుకోవడాలు మధ్య జరిగాయి. అయితే మొదటినుంచీ ప్రకాష్‌రాజ్‌ను నాన్ లోకల్ అనే ముద్రతో విష్ణు పేనల్ టార్గెట్ చేసింది. అలాంటి వ్యక్తికి నాగబాబు సపోర్ట్ చేశాడు. మెగా ఫ్యామిలీ నుంచి పూర్తి సపోర్ట్ వుందని అందరూ అనుకున్నారు. కానీ చిరంజీవి ఎక్కడా కూడా తన వాయిస్‌ను వినిపించలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సినిమా ఫంక్షన్‌లో నాన్‌లోకల్ అనేది సమస్యకాదు. అంటూనే ప్రకాష్‌రాజ్ గెలుస్తాడో లేదో తెలీదు. అంటూ.. ఆన్‌లైన్ టికెట్ వ్యవహారంలో జగన్‌రెడ్డి ప్రభుత్వాన్ని చిరంజీవికూడా నిలదీయాలంటూ అన్యాపదేశంగా సూచించారు.
ఇక, `మా` ఎన్నికలు జరిగాయి. విష్ణు గెలిచాడు. కానీ ఓటిమిని తట్టుకోలేని ప్రకాష్‌రాజ్ పేనల్ మూకుమ్మడి రాజీనామాలు చేసింది. దీనివెనుక నాగబాబు వున్నాడనేది తెలిసిందే. చిరంజీవి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుందనీ, చిరంజీవి తెరవెనుక అన్నీ నడిపిస్తారని సినిమారంగంలో అంటుంటారు. అయితే ఆదివారంనాడు ఎట్టకేలకు చిరంజీవి నోరు విప్పారు.
నేరుగా మోహన్‌బాబుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. `మా` ఎన్నికల్లో నేను ఎవరికీ సపోర్ట్ చేయలేదు. విష్ణు ఆధ్వర్యంలో మా అభివృద్ధి చెందాలని మాట్లాడారు. అందుకు మోహన్‌బాబు కూడా మనమంతా కలిసి `మా`ను ముందుకు తీసుకెళదాం అంటూ పేర్కొన్నారు. ఇక్కడ ఎవరికీ ఎవరితో శత్రుత్వంలేదని స్పష్టం చేశారు.
వెంటనే చిరంజీవి.. మోహన్‌బాబుతో స్నేహం ఇలాగే వుంటుందని స్పష్టం చేశారు. ఇదంతా ఆదివారంనాడు చిరంజీవి అభిమానులు బ్లడ్‌బేంక్‌లోని ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు చోటుచేసుకున్న విషయాలు. దీనితో మెగాస్టార్ చిరంజీవికి, మోహన్‌బాబు మధ్య శత్రుత్వం వుందని సోషల్‌మీడియాలో తెగ రాస్తున్న కథనాలకు ఫుల్‌స్టాప్ పడినట్లయింది. కానీ ఈ మాట చెప్పడం కాస్త ఆలస్యం అయిందనీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అభిమానులు మాట్లాడుకోవడం విశేషం.