శుక్రవారం, 5 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 4 డిశెంబరు 2025 (22:56 IST)

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

jagan
మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో పరకామణిలో జరిగిన చోరీ గురించి చెబుతూ... అదో చిన్న చోరీ, 9 డాలర్ల నోట్లు చోరీ జరిగింది. అంటే... మన ఇండియన్ కరెన్సీలో అది రూ.72000 అని అన్నారు. ఇప్పుడే దీనిపైన సోషల్ మీడియాలో జగన్ పైన ట్రోల్స్ పడుతున్నాయి. 9 డాలర్లు అంటే.. డాలర్ 90 రూపాయలు వేసుకున్నా రూ. 810 అవుతుంది. కానీ రూ.72,000 ఎలా అవుతుందంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
 
టిటిడి పరకామణి, లడ్డూ కల్తీ కేసులపై జగన్ తన నాయకులను సమర్థించారు. అమరావతి కోసం ఫేజ్ 2 భూసేకరణ గురించి అడిగినప్పుడు, జగన్ ఈ ప్రాజెక్టును ఇన్‌సైడర్ ట్రేడింగ్, నిర్మాణ ఖర్చులను పెంచిన స్కామ్‌గా అభివర్ణించారు. మూడు రాజధానుల ఆలోచనపై మీడియా అడిగిన ప్రశ్నకు జగన్ దాటవేశారు. 
 
2024 ఓటమి తర్వాత, రాజధాని అంశంపై జగన్ స్పష్టమైన వైఖరిని తెలియజేయలేదు. అమరావతి 2.0 పునఃప్రారంభ కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు. అమరావతి బిల్లు ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు వస్తుంది. ఆమోదం పొందిన తర్వాత, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధమైన రక్షణను పొందుతుంది.