బెణికిన నరం... మెగా స్టార్ చిరంజీవి చేతికి శస్త్ర చికిత్స
అపోలో ఆస్పత్రిలో మెగాస్టార్ చిరంజీవికి చిన్న శస్త్ర చికిత్స జరిగింది. అపోలో ఆస్పత్రిలో ఆయన కుడిచేతి మణి కట్టుకి సర్జరీ చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తనకు గత కొద్ది రోజులుగా కుడి చేయి నొప్పిగా ఉంటే వైద్యులను సంప్రదించామని, మణికట్టు దగ్గరున్న నరం మీద ఒత్తిడి పడిందని డాక్టర్లు చెప్పారని చిరంజీవి వివరించారు.
అపోలో ఆస్పత్రిలో తన కుడి చేతికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారని చెప్పారు. మీడియన్ నర్వ్ టిష్యూలను సర్జరీ ద్వారా సరి చేశారని, శస్త్ర చికిత్స జరిగిన 15 రోజులకు కుడి చేయి యథావిధిగా పని చేస్తోందన్నారు. చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇపుడు చిరంజీవి చేతికి శస్త్ర చికిత్స కారణంగా ఆయన మరో 15 రోజులు విశ్రాంతి తీసుకుంటారు. పదిహేను రోజుల తర్వాత తను యధావిధిగా షూటింగ్ లో పాల్గొంటానని చిరంజీవి మీడియా తెలిపారు.