సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 2 అక్టోబరు 2021 (17:31 IST)

పవన్ వ్యాఖ్యలకు నిరసనగా... రిపబ్లిక్ సినిమా బాయ్ కాట్!

జ‌న సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్య‌ల‌ను వ్యతిరేకిస్తూ, జగన్ అభిమానులు రిప‌బ్లిక్ సినిమాను బాయ్ కాట్ చేయాల‌ని పిలుపునిస్తున్నారు. కృష్ణా జిల్లా నూజివీడులో రిపబ్లిక్ సినిమాను బహిష్కరిoచాలని కోరుతూ, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు పిలుపు నిచ్చారు. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ వేదికపై వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, రిపబ్లిక్ మూవీపై బాణాన్ని ఎక్కు పెట్టిన వైసీపీ యువత ఆ సినిమాను వ్య‌తిరేకిస్తున్నారు.
 
పవన్ మాటల తూటాలకు హీరో సాయిధరమ్ తేజ్ సినిమా కలెక్షన్లపై దెబ్బ కొడతామనీ ఎదురు దాడికి దిగారు జగన్ అభిమానులు. దీనితో వైసీపీ,జనసేన పొలిటికల్ పోరులో రిపబ్లిక్ సినిమా బ‌ల‌య్యే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.