హైదరాబాద్‌లో ప్రారంభమైన మెగాస్టార్ చిరంజీవి- గాడ్ ఫాదర్ కొత్త షెడ్యూల్
Chiranjeevi, Godfather
మెగాస్టార్ సినిమా అంటే అభిమానులకు ఎలాంటి అంచనాలుంటాయో తెలిసిన దర్శకుడిగా మోహన్ రాజా.. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాకు తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు మార్పులు చేశారు. ఈ మూవీ షూటింగ్ గత నెలలో హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. మెగాస్టార్ మీద అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన లెటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ మూవీ కొత్త షెడ్యూల్ సోమవారం (నవంబర్ 1) నాడు ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో చిరంజీవి, ఇతర ముఖ్య తారాగణం మీద కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
మాస్టర్ సినిమాటోగ్రఫర్ నీరవ్ షా కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. సురేష్ సెల్వరాఘవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : మోహన్ రాజా, నిర్మాతలు : ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద, సంగీతం : ఎస్ఎస్ తమన, సినిమాటోగ్రఫర్ : నీరవ్ షా, ఆర్ట్ డైరెక్టర్ : సురేష్ సెల్వరాఘవన్.

