శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 నవంబరు 2021 (12:01 IST)

నీలాంబరి ప్రోమో సాంగ్ రిలీజ్ చేసిన 'ఆచార్య' టీమ్

డాషింగ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం 'ఆచార్య'. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంటే, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఓ కీలక పాత్రను పోషిస్తన్నారు. ఈయనకు జోడీగా పూజా హెగ్డే  నటిస్తుంది. 
 
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సోషల్ మెసేజ్ డ్రామాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 
 
ఈ మూవీలో చెర్రీ, పూజ హైలెట్ కానుంది. ఈ మేరకు ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లలో నీలాంబరి పాత్రలో పూజాహెగ్డే ట్రెడిషనల్ లుక్‌లో మెరిసింది. తాజాగా దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ వీరిద్దరిపై రూపొందించిన “నీలాంబరి” సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. నవంబరు 5వ తేదీన పూర్తి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. ర్తి సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.