మంగళవారం, 23 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (22:53 IST)

రాజ‌మౌళి రూటు మార్చాడు - అధికారిక ఫంక్ష‌న్ దుబాయ్‌లో (video)

Rajamouli
రాజ‌మౌళి సినిమాలు ఇప్పుడు తెలుగు సినిమారంగానికి కేంద్ర‌బిందువుగా మారాయి. దేశాల్లో ఆయ‌న సినిమాల‌కు మ‌రింత క్రేజ్ వ‌చ్చింది. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్‌.టి.ఆర్‌. న‌టించిన `ఆర్‌.ఆర్‌.ఆర్‌.` సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్త‌యి టెక్నిక‌ల్ వ‌ర్క్ మొత్తం విదేశాల్లోనే చేస్తున్నారు. ముంబైలో కొంత భాగం చేస్తున్నారు. అందులో ఓ భాగాన్ని దుబాయ్‌లో చేస్తున్నారు. ఇప్ప‌టికే బాహుబ‌లికి సంబంధించిన ఓ ఎపిసోడ్‌ను దుబాయ్ తీశారు. ఆ సినిమా త‌ర్వాత అక్క‌డ ఆయ‌న‌కు అభిమానులు పెరిగిపోయారు. ప్ర‌స్తుతం ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా ప్రీ రిలీజ్ కూడా అక్క‌డే చేయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఇప్ప‌టికే అక్క‌డి పంపిణీదారులుకూడా ముందుకు వ‌చ్చారు. అందుకే అక్క‌డ ఫంక్ష‌న్ ప్లాన్ చేసేంద‌కు స‌న్నాహాలు చేస్తున్నారు.
 
దుబాయ్‌లో తెలుగువారు, త‌మిళులు ఎక్కువ‌గా వుండ‌డంతో ఇది రెండు ర‌కాలుగా ఉప‌యోగ‌మ‌పి వాణిజ్య‌లెక్క‌లు చెబుతున్నాయి.  కొమురం భీం, అల్లూరి సీతారామరాజు వంటి ఇద్దరు సమరయోధుల పాత్రలను ఎన్టీఆర్, రామ్ చరణ్ పోషించారు. అన్ని బాష‌ల్లోని న‌టీన‌టులు ఇందులో న‌టించ‌డం విశేషం. డివివి దానయ్య నిర్మాత‌.ఇంకా ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, అలియా భట్ త‌దిత‌రులు న‌టించారు.