శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (11:36 IST)

మాదకద్రవ్యాల హబ్‌గా ఆంధ్రప్రదేశ్ : పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మాదకద్రవ్యాల హబ్‌గా మారిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఏపీలోని గంజాయి ప్రభావం దేశవ్యాప్తంగా పడుతోందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు. 
 
‘‘గంజాయి నివారణకు నేతలు చర్యలు తీసుకోవట్లేదు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతంలో 2018లో నా పోరాటయాత్రలో గంజాయిపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆ సమయంలో పోరాటయాత్ర చేశాను. ఏవోబీలో గంజాయి మాఫియాపై.. నిరుద్యోగం, అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఫిర్యాదులొచ్చాయి’’ అని పవన్‌ అన్నారు. 
 
ఏపీలో గంజాయి మూలాలున్నాయంటూ హైదరాబాద్‌ సీపీ, నల్గొండ ఎస్పీలు చేసిన వ్యాఖ్యల వీడియోలను పవన్‌ ట్వీట్లకు జత చేశారు. నిజానికి గత 2018లోనే ఏపీ-ఒడిస్సా బోర్డరులో గంజాయి రవాణ, మాఫియా వంటి అంశాలు తన దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. డ్రగ్స్ మూలాలు ఏపీలోనే ఉన్నాయంటూ హైదరాబాద్ సీపీ నల్గొండ ఎస్పీ ప్రకటనల క్లిప్పిగులను ట్వీట్టర్లో పోస్ట్ చేయడం ఇపుడు సంచలనంగా మారింది.
 
నిజానికి ఏపీ గంజాయి, డ్రగ్స్ విక్రయాలకు అడ్డాగా మారిందని టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై విలేకరుల సమావేశంలో ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. దీంతో టీడీపీ నేతలపై ఏపీ ప్రభుత్వం వరుసగా కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్న విషయంతెల్సిందే. మరి ఇపుడు పవన్‌పై కూడా అదేవిధంగా కేసులు పెడుతుందా? అనే చర్చ సాగుతోంది.