1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Fire Accident in Liquor Shop at Adillabad

ఆదిలాబాద్ మద్యం డిపోలో అగ్ని ప్రమాదం

Fire Accident
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూరులో ఉన్న ఓ మద్యం డిపోలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉట్నూరు క్రాస్‌రోడ్డులోని ఐఎంఎల్‌డీ మద్యం డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి క్రమంగా డిపో మొత్తానికి విస్తరించాయి. దీంతో అందులో ఉన్న లక్షలాది విలువ చేసే మద్యం బాటిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని అధికారులు  తెలిపారు. కోట్లలో ఆస్తినష్టం జరిగినట్లు అంచనావేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తర్వాతి కథనం
మాదకద్రవ్యాల హబ్‌గా ఆంధ్రప్రదేశ్ : పవన్‌ కల్యాణ్‌