బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (08:58 IST)

తమిళనాడులు బాణాసంచా దుకాణంలో పేలుడు.. ఐదుగురి మృతి

తమిళనాడు రాష్ట్రంలోని కల్లకురిచ్చి జిల్లా శంకరాపురంలో ఓ బాణాసంచా దుకాణంలో మంగళవారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మణం పాలయ్యారు. వీరిలో ముగ్గురు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
శంకరాపురంలోని సెల్వగణపతి అనే వ్యక్తికి చెందిన టపాకాయాల దుకాణంలో ఈ పేలుడు సంభవించి, ఐదుగురు సజీవ దహనమయ్యారని జిల్లా కలెక్టర్ పిఎన్ శ్రీధర్ తెలిపారు. మరో 11 మంది కార్మికులు గాయపడ్డారని, క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించామని ఆయన చెప్పారు. 
 
ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశాయి. సహాయక చర్యలు త్వరితగతిన పూర్తిచేశారు. ఈ టపాకాయల దుకాణానికి సమీపంలో ఉన్న ఓ బేకరీ షాపులో చెలరేగిన మంటలు నలువైపులా వ్యాపించాయి. దీంతో బాణాసంచా దుకాణానికి మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.ే