తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు
తమిళ సినిమా చరిత్రలో మూలస్తంభాల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ప్రముఖ చిత్ర నిర్మాత ఏవీఎం శరవణన్ (86) గురువారం ఉదయం వయసు సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడించారు. ఆయన మృతి భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక యుగానికి ముగింపుగా పలువురు సినీ ప్రముఖులు పేర్కొంటున్నారు.
బుధవారం తన పుట్టినరోజును జరుపుకున్న ఏవీఎం శరవణన్ తరతరాలుగా సినిమా ప్రపంచాన్ని తీర్చిదిద్దిన ఏవీఎం కంపెనీ ఆధ్వర్యంలో లెక్కలేనన్ని హిట్ చిత్రాలను సృష్టించడంలో కీలక శక్తిగా నిలిచారు. తమిళ సినిమాకు ఆయన చేసిన సేవలు అపరిమితమైనవి.
ఆయన భౌతికకాయం గురువారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు ప్రజలు, బంధువులు మరియు పరిశ్రమ స్నేహితుల నివాళులర్పించడానికి ఏవీఎం స్టూడియోస్ మూడో అంతస్తులో ఉంటుంది.
గురువు, మార్గదర్శకుడు అయిన ఏవీఎం శరవణన్ సర్ మృతితో మొత్తం చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన సాధించిన విజయాలు తమిళ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి.