బుధవారం, 26 నవంబరు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 నవంబరు 2025 (18:32 IST)

ఛటేశ్వర్ పుజారా బావమరిది ఆత్మహత్య

pujara brother in law
భారత మాజీ క్రికెటర్ ఛటేశ్వర్ పూజారా బావమరిది అనుమానాస్పదంగా మృతి చెందాడు. పుజారా భార్య పుజాకు సొంత సోదరుడు పబారీ. ఆయన బుధవారం రాజ్‌కోట్‌లోని తన నివాసంలో విగతజీవిగా కనిపించాడు. అతను విగతజీవిగా ఇంట్లోపడివుండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి హుటాహుటిన తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న మాలవీయనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పబారీ ఆత్మహత్య చేసుకున్నట్లు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకుని అధికారికంగా దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
 
2024లో జీత్ రసిఖ్‌భాయ్‌పై అతను పెళ్లి చేసుకోవాలనుకున్న యువతి అత్యాచార ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరిగ్గా ఏడాది తర్వాత జీత్‌ ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. 
 
గత సంవత్సరం దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం జీత్ పెళ్లి చేసుకోవాలనుకున్న యువతి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో లైంగిక సంబంధానికి బలవంతం చేశాడని ఆరోపించింది. వారి నిశ్చితార్థం తర్వాత వేధింపులు కొనసాగాయని, ఆ తర్వాత అతను ఒక్కసారిగా సంబంధాన్ని తెంచుకున్నాడని ఆరోపించింది.