ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన ఆండ్రీ రస్సెల్
వెస్టిండీస్ క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు, ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు తన వీడ్కోలు పలికాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరపున 12 సీజన్లు బరిలోకి దిగిన రస్సెల్ తన ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలికాడు. అయితే అతడు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సపోర్టింగ్ స్టాప్, పవర్‌కోచ్‌గా కొనసాగుతానని ప్రకటించాడు.
రస్సెల్ ఇప్పటివరకు 140 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 174.2 స్ట్రైక్ రేట్, 28..2 యావరేజ్‌తో 2651 పరుగులు చేశాడు. రస్సెల్ అత్యధిక స్కోరు 88 పరుగులు (నాటౌట్) కావడం గమనార్హం. బౌలింగ్‌లో 23.3 యావరేజ్‌తో 123 వికెట్లు తీసుకున్నాడు. ఒక సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.