బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (10:37 IST)

డిస్నీ - మార్వెల్ లేటెస్ట్ సూప‌ర్ హీరో మూవీ ఎట‌ర్నెల్స్ లో ఏంజెలీనా జోలీ

Angelina Jolie
దీపావ‌ళీ కానుక‌గా న‌వంబ‌ర్ 4న‌ డిస్నీ - మార్వెల్ లేటెస్ట్ సూప‌ర్ హీరో మూవీ ఎటర్నెల్స్ విడుద‌ల కానుంది. ఎవెంజ‌ర్స్ సిరీస్ ఎండ్ అవ్వ‌డంతో హాలీవుడ్ మూవీ ల‌వ‌ర్స్ ని ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి మార్వెల్ వారు ఎట‌ర్నెల్స్ అనే కొత్త సూప‌ర్ హీరోల్ని సృష్టించారు, భార‌త‌దేశంలో ఉన్న అన్ని ముఖ్య‌మైన భాష‌ల్లో ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ తో పాటు ఒకేసారి విడుద‌ల చేయ‌నున్నారు. 
 
ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజెలీనా జోలీ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు థేనా అనే సూప‌ర్ వుమెన్ గెటెప్ లో ఏంజెలీనా త‌న ఫ్యాన్స్ ని ఎంట‌ర్ టైన్ చేయ‌బోతున్నారు. ఎవెంజ‌ర్స్ కి మించిన ప‌వ‌ర్స్ తో ఎట‌ర్నెల్స్ లో సూప‌ర్ హీరోలు అద్భుత‌మైన విన్యాసాలు చేయనున్నారు. అలానే ఈ సినిమాలో ఇండియ‌న్ వెడ్డింగ్ కి సంబంధించిన స‌న్నివేశాలు కూడా ఉన్నాయ‌ని డిస్నీ ఇండియా బృందం తెలిపింది. బిగ్ స్క్రీన్ పై ఎట‌ర్నెల్స్ లో ఉన్న సూప‌ర్ హీరోలు ప్రేక్ష‌కుల‌కి వీనుల విందు ఇవ్వ‌నున్న‌ట్లుగా మూవీ టీమ్ ప్ర‌క‌టించింది.