సోమవారం, 18 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 22 అక్టోబరు 2021 (19:05 IST)

మా-లో మహిళల ర‌క్ష‌ణ కోసం సునీత కృష్ణన్ ఆధ్వ‌ర్యంలో సెల్ ఏర్పాటుః మంచు విష్ణు

Sunita Krishnan, Manchu Vishnu
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షునిగా ప‌ద‌వీ చేప‌ట్టిన త‌ర్వాత మంచు విష్ణు ఓ కొత్త ప్ర‌యోగానికి శ్రీ‌కారం చుట్టారు. ఇప్ప‌టివ‌ర‌కు అందులోని మ‌హిళా స‌భ్య‌ల్లో కొంద‌రిని మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం ఓ క‌మిటీని ఏర్పాటు చేసేవారు. కానీ తొలిసారిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, మానవతావాది, నిర్మాత అయిన‌ సునీత కృష్ణన్ ఆధ్వ‌ర్యంలో ఓ సెల్‌ను ఏర్పాటు చేశారు.

ఈమె దేశంలో అభాగ్యులైన ఎంతోమంది మ‌హిళ‌ల‌కు అండ‌గా నిలిచి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె ఒరిస్సాలోని మయూర్ బంజ్ జిల్లా, పరిసర ప్రాంతాల్లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా, వాస్తవికతకు దగ్గరగా 'దహిణి' చిత్రాన్ని రూపొందించారు.
 
ఈ విష‌యాన్ని శుక్ర‌వారంనాడు మంచు విష్ణు తెలియ‌జేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. మా- బ‌లంగా మ‌రింత  జవాబుదారీగా వుండాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. అందుకే  మహిళా సాధికారత  అండ్  గ్రీవెన్స్ సెల్ ను (డ‌బ్ల్య‌.ఇ.జి.సి.) విశాఖ మార్గదర్శకత్వానికి అనుగుణంగా ఏర్పాటు చేశాం. ఇందుకు చాలా సంతోషిస్తున్నాం. ఆమె మా గౌర‌వ స‌ల‌హాదారుగా మా క‌మిటీకి సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. ఈ క‌మిటీలో న‌లుగురు మ‌హిళ‌లు, ఇద్ద‌రు పురుషులు వుంటారు. త్వ‌ర‌లో ఆ వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం. మా ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న అభివృద్ధిలో మొద‌టి మెట్టుగా భావిస్తున్నాం. మ‌హిళల ర‌క్ష‌ణ‌కోసం మా క‌ట్టుబడి వుంద‌ని మంచు విష్ణు పేర్కొన్నారు.