ఎవరో ఒకరు నచ్చితే నా వెనక వున్నట్టా - నన్ను పావుగా వాడుకోలేదుః ప్రకాష్‌రాజ్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్ వెనుక చిరంజీవి ఫ్యామిలీ వుందనేది అందరూ అనుకుంటుందే. నాగబాబు బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఇందుకు ఊతం కలిగింది. ఇదే విషయాన్ని ప్రకాష్‌రాజ్‌ను అడిగితే `ఎవరో ఒకరు నచ్చితే. వాడు వెనకున్నట్లా?` అంటూ తెలివిగా సమాధానం చెప్పారు. బహిరంగంగా చిరంజీవి పేరు చెప్పడం ఆయనకు ఇష్టంలేదని అర్తమైంది.
సినిమారంగంలో కమ్మ, రెడ్డి కలిసిపోయారు. కాపును వేరుచేశారు. ఇలా కుల యుద్ధాల్లో మీరు పావు అయిపోయారు కదా? అనే ప్రశ్నకు ప్రకాష్‌రాజ్ తనదైన శైలిపో స్పందించారు.
- అలా అనుకుంటున్నారు. కాదంటున్నాను కదా! అనుమానాల్లేవు. నేను పావు కాదు. అది డిస్టర్బింగ్ ఫ్యాక్టర్. అన్ని పెద్దరికాల్ని నేను ప్రశ్నిస్తున్నాను కదా. ఎటెళ్లినా వీడు డేంజరేనని తెలుసు.
- మా తరఫున ప్రకాశ్‌రాజ్‌ను పెట్టాలనుకుంటున్నాం. మీ కొడుకును విత్‌డ్రా చేయించు అని మోహన్‌బాబుకి చిరంజీవి ఫోన్ చేశారట కదా..అన్న ప్రశ్నకు ప్రకాష్‌రాజు స్పందిస్తూ, నిజం కావచ్చు.. అబద్ధం కూడా కావచ్చు కదా. అంటూ తప్పించుకున్నారు.
ఇలా ఆసక్తికరమైన ఇంటర్వ్యూ ఆదివారం రాత్రి టీవీషోలో జరిగింది. అయితే `మా` ఎన్నికలకు ముందే ప్రకాష్‌రాజ్‌తో షూట్ చేశారు. కానీ కొన్ని కారణాలవల్ల ఆ ఎపిసోడ్ వేయలేకపోయారు. ఫైనల్‌గా ఫలితాలు వచ్చాక మరలా కొత్తగా ప్రకాష్‌రాజ్‌తో షూట్ చేసి ప్రదర్శించారు. ఫైనల్‌గా ప్రకాష్ రాజ్ తన పేనల్ రాజీనామా చేసినా, మంచు విష్ణు చెప్పినవి చేయకపోతే ప్రశ్నిస్తానని ప్రకాష్‌రాజ్ స్పష్టం చేశాడు.