సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 21 అక్టోబరు 2021 (13:53 IST)

మా - స‌భ్యుల కోసం మంచు విష్ణు కీల‌క నిర్ణ‌యం

Vishnu meeting
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ నూత‌న అధ్య‌క్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు తొలిసారిగా కార్య‌వ‌ర్గ స‌మావేశం ఏర్పాటు చేశారు. ఆయ‌న పేన‌ల్‌లో గెలిచిన వారంతా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లు విష‌యాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఇటీవ‌ల ప్ర‌కాష్‌రాజ్ అడిగిన సీసీ ఫుటేజ్ తోపాటు వారి రాజీనామాల విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ని స‌మాచారం. అయితే దీనిపై ఎవ‌రూ మాట్లాడ‌కూడ‌ద‌ని నియ‌మాన్ని పెట్టుకుని పాటించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. 
 
ఇక రెండో అసోసియేష‌న్ ఏర్పాటు గురించి బ‌య‌ట అనుకుంటున్నార‌నే విష‌య‌మై అదంతా పుకారే అని ఏదిఏమైనా బైలాస్ ప్ర‌కారం మ‌నం న‌డుచుకోవాల‌ని తెలియ‌జేసిన‌ట్లు స‌మాచారం. గురువారంనాడు మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ కార్యాల‌యంలో స‌మావేశమ‌య్యారు. ఇన్యూరెన్స్‌కు సంబంధించిన ప్ర‌తినిధులు కూడా పాల్గొన్నారు. స‌భ్యుల‌కు ఎటువంటి సౌక‌ర్యాలు ఇవ్వ‌గ‌ల‌రో తెలియ‌జేయాల‌ని వారిని అడుగ‌గా, వారు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఇంత‌కుముందున్నట్లుగా హెల్త్ ఇన్యూరెన్స్‌తోపాటు ఏదైనా అనారోగ్యం పాల‌యితే వెంట‌నే ఆసుప‌త్రినుంచి అంబులెన్స్ కూడా వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంచు విష్ణు ప్ర‌తినిధుల‌ను కోరారు. అందుకు ఈసారినుంచి అటువంటి ఏర్పాటు చేసేలా ఆసుప‌త్రి యాజ‌మాన్యంతో మాట్లాడ‌తామ‌ని వారు హామీ ఇచ్చారు.
 
గ‌తంలో బాగానే చేసినా, మ‌న ఆధ్వ‌ర్యంలో మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు చేయాల‌నేది త‌న మ‌త‌మ‌ని మంచు విష్ణు స్ప‌ష్టం చేశారు. ఇక ఫించ‌న్ విష‌యంలో మ‌రోసారి చ‌ర్చించార‌నీ ఇప్ప‌టివ‌ర‌కు య‌థాథంగా అంద‌రికీ ఫించ‌న్లు వెలుతున్నాయోలేదోన‌ని అక్క‌డి సిబ్బంది అడిగి తెలుసుకున్నారు.