మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (13:51 IST)

మేమంతా జోకర్స్ అయితే.. మీరు రింగ్ మాస్టర్ : ఆర్జీవికి విష్ణు కౌంటర్

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు గట్టి కౌంటర్ ఇచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యులను జోకర్స్‌గా ఆర్జీవీ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
దీనికి మా అధ్యక్షుడు మంచు విష్ణు గట్టిగానే కౌంటరిచ్చారు. మేమంతా జోకర్స్ అయితే మీరు రింగ్ మాస్టర్ అంటూ రిప్లై ఇచ్చారు. దీనికి ఆర్జీవీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందా అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
 
ఇదిలావుంటే, మా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటా అధ్యక్ష పదవికి పోటీ చేసిన ప్రకాష్ రాజ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఈ ఆరోపణలను ఆధారంగా చేసుకుని ఆర్జీవీ విమర్శలు గుప్పిస్తున్నారు.