మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (11:21 IST)

మాలో ఉన్నవారంతా జోకర్సే.. ఆర్జీవీ ట్వీట్

టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు వివాదాస్పద ట్వీట్ చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో ఉన్న వారందరినీ జోకర్స్‌గా పరిగణించారు. 'మా అసోసియేషన్‌ ఓ సర్కస్ అని.. రెండు రోజుల కింద ట్వీట్ చేసిన రాంగోపాల్ వర్మ… తాజాగా మరోసారి మా వివాదంపై క్రియేట్ చేశారు. మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓ సర్కస్ అని… అందులో ఉండే సభ్యులంతా జోకర్లు అంటూ వర్మ సంచలన ట్వీట్ చేశారు. 
 
ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన ఈ ఫీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చీలికలు తెచ్చిన సంగతి తెలిసిందే. రిగ్గింగ్ జరిగిందని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తుంటే…. అదేం లేదని మంచు విష్ణు ప్యానెల్ చెబుతోంది. అందుకే రాంగోపాల్ వర్మ తనదైనశైలిలో వివాదాస్పద ట్వీట్లలో రెచ్చిపోతున్నారు.