1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (12:11 IST)

కుమారుడుకి విషమిచ్చి చంపేసిన తండ్రి.. ఎందుకో తెలుసా?

కన్నతండ్రి తన కుమారుడికి విషమిచ్చి చంపేశాడు. కుమారుడు అనుభవిస్తున్న నరకాన్ని చూడలేక అతనికి ఆ బాధ నుంచి విముక్తి కల్పించాలని భావించిన తండ్రి ఈ పని చేశాడు. ఇది తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అలాగే మృతుడి తండ్రిని, అతనికి సహకరించిన బంధువును అదుపులోకి తీసుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. 
 
రాష్ట్రంలోని సేలంలోని ఎడప్పాడి ప్రాంతానికి చెందిన పెరియ స్వామి అనే వ్యక్తికి ఒకే కుమారుడు. 14 ఏళ్ల వయస్సున్న ఆ బాలుడుకి కాలిలో కణితి వచ్చింది. దీంతో సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా దాన్ని పరీక్షించిన వైద్యులు కేన్సర్ కణితిగా గుర్తించారు. 
 
దీనికి చికిత్స చేయించడానికి స్వామి ఆర్థిక స్తోమత సరిపోవడం లేదు. ప్రతిరోజూ కేన్సర్‌తో కుమారుడు పడుతున్న నరకం కూడా చూడలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో ల్యాబ్‌లో పనిచేస్తున్న ప్రభు అనే బంధువు సాయంతో విషం ఇంజెక్షన్ తెప్పించాడు. నిద్రలో ఉండగా కుమారుడికి ఇంజెక్ష్ ఇచ్చేశాడు.
 
దీంతో ఆ బాలుడు నిద్రలోనే మరణించాడు. చుట్టుపక్కల వారిని తన బిడ్డ కేన్సర్‌తోనే మరణించినట్లు నమ్మించాడు. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి స్వామిని, ప్రభును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పాడు. తన కుమారుడు నరకయాతన పడటం చూడలేక ఈ పని చేసినట్టు బోరున విలపిస్తూ పోలీసులకు చెప్పాడు.