గురువారం, 6 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : మంగళవారం, 4 నవంబరు 2025 (12:51 IST)

Chandini Chowdary,: తరుణ్ భాస్కర్ క్లాప్ తో చాందినీ చౌదరి చిత్రం లాంచ్

Tarun Bhaskar claps for Chandani Chaudhuri
Tarun Bhaskar claps for Chandani Chaudhuri
నిన్న ఫిలింనగర్ లోని దైవసన్నిదానంలో చాందినీ చౌదరి కొత్త సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయింది. తరుణ్ భాస్కర్ క్లాప్ తో ప్రారంభమైంది. చాందినీ చౌదరి, సుశాంత్ యాష్కీ ప్రధాన పాత్రల్లో, వికాస్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానర్ లో ఈ చిత్రం రూపొందుతోంది. సహచారి క్రియేషన్స్ బ్యానర్‌పై సృజన గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతా భాస్కర్, చిత్ర యూనిట్ సభ్యులు లాంచింగ్ ఈవెంట్ కి హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. సహచారి ప్రొడక్షన్ 2 లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కాన్సెప్ట్ విన్నాను. చాలా యూనిక్ కాన్సెప్ట్ వస్తున్నారు. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.
 
నిర్మాత సృజన గోపాల్ మాట్లాడుతూ.. సహచారి క్రియేషన్స్ సినిమా ఇండస్ట్రీలో చాలా కొత్త కాన్సెప్ట్ ని పరిచయం చేయబోతుంది. సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానెర్లో ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ని అందించడానికి ప్రయత్నిస్తున్నాం. సినిమా కోసం టీం చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాము. ఎవరు ఊహించని ఒక సూపర్ హీరోని పరిచయం చేస్తున్నాము. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాకు శుభాకాంక్షలు తెలియజేసిన తరుణ్ భాస్కర్ గారికి ధన్యవాదాలు.
 
సైన్స్ ఫిక్షన్, డార్క్ కామెడీతో పాటు ఈ చిత్రంలో ఒక సూపర్ నేచురల్ ఎలిమెంట్ కూడా ఉంది. ఈ చిత్ర కాన్సెప్ట్ వీడియోను టీమ్ త్వరలోనే విడుదల చేయనుంది. నవంబర్ చివరిలో హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
 
ఈ చిత్రంలో జీవన్ కుమార్, అజయ్ గోష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తుండగా, జితిన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.