మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (10:36 IST)

గాల్లోకి ఎగిరిన ఇన్నోవా కారు - స్పాట్‌లోనే ముగ్గురు మృతి

ఏపీలోని కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఇన్నోవా కారు టైర్ పేలి.. అటుగా వస్తున్న బైక్‌పై పడడం ప్రమాదం సంభవించింది. 
 
ఆళ్లగడ్డ పట్టణ సమీపంలోని నంద్యాల హైవేలో గోదాం దగ్గరలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు టైర్ పేలడంతో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. డివైడర్ దాటుకుని.. అటువైపు నుంచి వస్తున్న బైక్‌పై పడింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మ‌ృతి చెందారు. 
 
మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ నలుగురు వ్యక్తులు కూడా శిరివెళ్ల గ్రామానికి చెందిన వారిగా తెలసింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.