మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 అక్టోబరు 2021 (11:23 IST)

నవంబరు 12న కేసీఆర్ బయోపిక్ రిలీజ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "తెలంగాణ దేవుడు". కేసీఆర్ పాత్రలో హీరో శ్రీకాంత్ టైటిల్ రోల్ పోషిస్తుంచారు.
 
ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులూ దాదాపు అయిపోయాయి. దీంతో సినిమాను వచ్చే నెల 12న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.
 
దీనిని జీషన్ ఉస్మానీ, మహ్మద్ జాకీర్ ఉస్మాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాకీర్ ఉస్మాన్ మూలకథను అందించారు. వడత్యా హరీశ్ దర్శకత్వంలో సినిమా రూపొందింది. నందన్ బొబ్బిలి స్వరాలు అందించారు.