టావీవుడ్‌లో ఒకవైపే కాదు - రెండో వైపు కూడా చూడాలి - గాయాలు ఎందుకు జరిగాయి
గత ఏడాది కరోనా మమహ్మారి తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసింది. ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్ ఎత్తివేయడంతో థియేటర్లు ఓపెన్ అయి సినిమాలకు ప్రేక్షకులు రావడం మొదలుపెట్టారు. అంతా సజావుగా వుంటుందనుకుంటుంటే సినిమా హీరోలకు ఏదో ఒక బ్రేక్ పడుతోంది. ఒక్కొక్కరు ప్రమాదాలకు గురవుతున్నారు.
ఇటీవలే సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురయి చావుకు చివరి అంచున చూసి బయటపడ్డాడు. ఇక మరికొందరు సర్జరీలు చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. బాలకృష్ణ ఇటీవలే ఆహా షోలో గుర్రంపై నుంచి పడి కుడిచేయికి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. చిరంజీవి కూడా తన కుడిచేయి అరచేయి బెనకడంతో కట్టుకట్టించుకోవాల్సి వచ్చింది. కుడిచేత్తో ఏ పనిచేసినా కష్టం ఉంటుందని తిమ్మిరిలు వస్తున్నాయన వైద్యులు సర్జరీ చేశారని చిరు క్లారిటీ ఇచ్చారు.
ఇక దీపావళికి ఎన్.టి.ఆర్. కూడా కుడిచేయి అరచేతికి కట్టుకుని తన పిల్లలతో దీపావళి చేసుకోవాల్సివచ్చింది. ఆమధ్య పవన్ కళ్యాణ్ కూడా కొద్ది రోజుల ఆసుప్రతి పాలయిన విషయం తెలిసిందే. హీరో రామ్ కూడా మెడ బెణకడంతో కొద్దిరోజులు కట్టు కట్టుకోవాల్సి వచ్చింది. ఇక తమిళనాడులో రజనీకాంత్ ఆరోగ్యం గురించి తెలిసిందే.
అయితే వీరంతా ఫోకస్‌లో వుండడంతో వారి పేర్లు బయటకు వస్తున్నాయి. 24 శాఖలలో ఆమధ్య ఓ కెమెరామెన్ క్రేన్ మీదనుంచి దిగుతుండగా పడడంతో మోచేతికి బాగా తగిలింది. దాంతో వైద్యులు మూడు వారాల రెస్ట్ తీసుకోమన్నారు.
ఇక ఫైటర్లు అసిస్టెంట్లు ఏదో సినిమాలో ఎవరో ఒకరు గాయాలు పాటు కావడం సహజమే. ఇలా టెక్నీషియన్ కూడా కొందరు గాయాలు పాలయ్యారు. ఏదో గ్లామర్ ఫీల్డు అంతా రంగుల మయం అనుకుంటే పొరపాటే. ఇక్కడ ఒక్కొక్కరు కష్టం కూడా వుంటుంది. టోటల్‌గా చూస్తే, గ్లామర్ ఫీల్డుకు దిష్టి తగిలిందని విశ్లేషకులు భావిస్తున్నారు.