సంబంధిత వార్తలు
- పవన్‌కు టీడీపీ సపోర్ట్.. జగన్‌కు చిత్తశుద్ధి వుంటే ఆ పని చేయాలి...?
- ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీకి డెడ్ లైన్ పెట్టు జానీ!
- వారం రోజులు టైమ్ ఇస్తున్నా.. పవన్ డెడ్‌లైన్‌పై వైసీపీ కౌంటర్
- పవన్ స్టీల్ ప్లాంట్ సభపై గుడివాడ అమర్నాథ్ 12 పాయింట్లు
- ఉన్న ఒక్క ఎమ్మెల్యేను వైసీపీ లాక్కెళ్లిపోయింది, కానీ అమిత్ షా మాత్రం: పవన్ కళ్యాణ్
పవన్‌ను అభినందించిన నాని.. జానీ లాంటి సినిమాలు చూపించాలని?
ఏపీలో పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు భయపడే వ్యక్తులు, శక్తులు ఎవరూ లేరని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. చనిపోయిన పార్టీ జనసేన మాకు డెడ్ లైన్లు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నేపథ్యంలో ఉద్యమం చేయడానికి పవన్ కళ్యాణ్ ముందుకు రావడం పట్ల ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని నాని అన్నారు.
ఢిల్లీ వెళ్ళి నరేంద్రమోడీకి డెడ్ లైన్లు పెట్టమనండంటూ సలహా ఇచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వారం రోజుల్లో ఆపకపోతే ఏదో ఒకటి చేస్తానంటూ గతంలో నటించిన జానీ వంటి పాత సినిమాలను వాళ్ళకు చూపించాలన్నారు. వాటిని చూసి నరేంద్రమోడీ భయపడతారేమో చూడాలన్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వారం రోజుల్లో ఆపకపోతే ఏదో ఒకటి చేస్తానంటూ గతంలో నటించిన జానీ వంటి పాత సినిమాలను వాళ్ళకు చూపించాలని సెటైర్ వేసారు. అది డెడ్ పార్టీ కదా, రెండు చోట్ల పోటీ చేసి ఆయనే గెలవలేదని ఎద్దేవా చేసారు.
