బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (11:32 IST)

పవన్‌కు టీడీపీ సపోర్ట్.. జగన్‌కు చిత్తశుద్ధి వుంటే ఆ పని చేయాలి...?

ఏపీలో రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం విప్పిన జనసేనాని పవన్…కేంద్రంలోని బీజేపీపై పోరాటం చేయకుండా రాష్ట్రంలోని వైసీపీపై విమర్శలు చేశారు. వైసీపీ పోరాటం చేయాలని, అలాగే అఖిలపక్షాన్ని వారం రోజుల లోపు ఢిల్లీకి తీసుకెళ్లాలని లేదంటే పోరాటాన్ని ఉదృతం చేస్తామని చెప్పారు.
 
పవన్ ఇలా చెప్పిన వెంటనే…వైసీపీ నేతలు ఎటాక్ మొదలుపెట్టారు. బీజేపీపై పోరాటం చేయకుండా తమపై పోరాటం చేస్తే ఏం వస్తుందని ప్రశ్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ ఇన్ని రోజులు గుడ్డి గుర్రం పళ్ళు తోమారా? అంటూ మంత్రి అప్పలరాజు ఫైర్ అయ్యారు. పవన్…చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శిస్తున్నారు. 
 
వైసీపీ నేతల ఎటాక్ వెంటనే…టీడీపీ నేతలు పవన్‌కు సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. చంద్రబాబుతో సహ టీడీపీ నేతలు… జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అఖిపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే స్టీల్ ప్లాంట్‌పై రాజకీయం చేస్తూ జగన్‌ని టార్గెట్ చేసి బాబు-పవన్‌లు గేమ్ స్టార్ట్ చేశారని అర్ధమవుతుంది.