1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YSRCP leaders to meet President Ramnath Kovind

తెదేపాపై ఫిర్యాదుకు రాష్ట్రపతిని కలవనున్న వైకాపా బృందం

YSRCP
వైకాపాకు చెందిన ప్రతినిధి బృందం మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలవనుంది. తమ పార్టీపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని రాష్ట్రపతికి వివరిస్తామని వైకాపా నేతలు తెలిపారు.
 
ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైకాపా బృందం ఢిల్లీలో నేడు రాష్ట్రపతిని కలవనుంది. తెదేపా దుష్ప్రచారాన్ని రాష్ట్రపతికి వివరిస్తామని వైకాపా నేతలు తెలిపారు. ఇదిలావుండగా, కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెదేపా నేతలు కలిశారు. 
 
ఢిల్లీకి వెళ్లిన పలువురు నేతలు సోమవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల్ని కలిశారు. వైకాపా గుర్తింపును రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై చేస్తున్న దాడులు, వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. గంజాయి సహా రాష్ట్రంలోని సమస్యలను ప్రస్తావిస్తే తమపై దాడులు చేస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తర్వాతి కథనం
ఏపీలో బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం