సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 27 అక్టోబరు 2021 (15:04 IST)

విజ‌య‌సాయికి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన అయ్య‌న్న‌

వైసీపీ ప్ర‌భుత్వానికి గౌర‌వ స‌ల‌హాదారు విజయసాయి రెడ్డికి మాజీ మంత్రి, టీడీపీ నేత అయన్నపాత్రుడు  స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నేత అయన్నపాత్రుడు త‌న ట్విట్ట‌ర్ ద్వారా విజ‌య‌సాయిపై విరుచుకుప‌డ్డారు. 
 
మోదీ, షా అపాయింట్మెంట్ అంటూ హడావిడి చెయ్యడానికి ముందు... రోజు జగన్ రెడ్డి బాత్ రూంలో కాలు జారిపడటం మర్చిపోతే ఎలా వీసా రెడ్డి? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజయ సాయిరెడ్డి మాటల్లో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. వైజాగ్ నుండి ఆయ‌న్ని వెలివెయ్యడంతో, జగన్ రెడ్డిని జైలుకి పంపడమే ఎజెండాగా ఢిల్లీలో తిరుగుతున్నాడు. హెరాయిన్, గంజాయి డ్రగ్ డాన్ జగన్ రెడ్డి పూసాలు కదులుతున్నాయి. కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణలో జగన్ అండ్ డ్రగ్ గ్యాంగ్ త్వరలో అరెస్ట్ అవ్వడం ఖాయం. అన్నారు. 
 
వైసీపీ ఒక బూతు పార్టీ. అసభ్యకరంగా మాట్లాడటాన్ని నిషేధిస్తూ, చట్టం తెస్తే దేశంలో ముందుగా బూతు పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి చిప్పకూడు తినడం, బూతు పార్టీ గుర్తింపు రద్దవ్వడం ఖాయం....అని అయ్య‌న్న జోస్యం చెప్పారు. అయితే, ఇదే అయ్య‌న్న గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట‌లో కోడెల వ‌ర్ధంతి స‌భ‌లో బూతుల పంచాంగం విప్పిన విష‌యం విదిత‌మే. ఆయ‌న వ్యాఖ్య‌లు కూడా అప్ప‌ట్లో తీవ్ర సంచ‌ల‌నం క‌లిగించాయి. రాజ‌కీయ దుమారాన్ని రేపాయి.