మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 10 అక్టోబరు 2021 (10:45 IST)

క్లైమాక్స్‌కి చేరిన మా ఎన్నికలు.. బండ్ల గణేష్ చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి పీక్ స్టేజ్‌కి చేరింది. ఇంచుమించు క్లైమాక్స్‌కి వచ్చేసినట్టే. ‘మా’ ఎన్నికల ప్రారంభం నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చుకుంటూ వస్తోన్న బండ్ల గణేశ్.. చివరి నిమిషంలో తన మార్క్ ట్వీట్ వేశారు. వివిధ పరిణామాల అనంతరం ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు ఫైనల్‌గా ప్రకటించిన బండ్ల గణేష్ చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. 
 
మంచు విష్ణు ప్యానల్‌ నుంచి జనరల్ సెక్రటరీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న రఘు బాబుకు ఓటు వేయాలని కోరాడు. ‘మా సభ్యులకు విన్నపం దయచేసి మీ అమూల్యమైన ఓటు జనరల్ సెక్రెటరీగా రఘు బాబు వేసి గెలిపించ వలసినదిగా నా ప్రార్థన’ అని పేర్కొన్నాడు. జీవితకు వ్యతిరేకంగా ఆయన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఫలితాలు ఎలా వస్తాయన్నది రేపు సాయంత్రం ఈ సమయానికి తేలిపోనుంది.