శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (23:19 IST)

‘మా’ ఎన్నికల్లో కచ్చితంగా ఓటు వేస్తున్నా: సిద్దార్థ్

"నేను ‘మా’లో లైఫ్ టైం మెంబర్‌ను. ఆహూతి గారు ఉన్న సమయంలోనే మెంబ‌ర్‌షిప్ తీసుకున్నాను. ‘మా’ ఎన్నికల్లో కచ్చితంగా ఓటు వేస్తున్నా" అన్నారు హీరో సిద్దార్థ్. 

ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ.. "అన్నీ కూడా ఫాలో అవుతున్నాను. నేను కచ్చితంగా అందరి మాటలు విని.. నా మనసులో ఏమనిపిస్తుందో.. వారికే ఓటు వేస్తాను. ఎప్పుడూ నిజం మాట్లాడాలి. నిజాయితీగా ఉండాలని అనుకుంటాను.

దాని వల్ల ఎలాంటి పరిణామాలు వచ్చినా ఎదుర్కోవాలి. నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. రాజకీయాల్లోకి రాను అని చెప్పను. కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ" అని వ్యాఖ్యానించారు.