శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (20:22 IST)

'ఉప్పెన' విలన్ విజయ్ సేతుపతిపై దాడి

తెలుగు చిత్రం 'ఉప్పెన'లో హీరోయిన్ తండ్రి పాత్రను పోషించి విలన్‌గా నటించిన తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి బెంగుళూరు విమానాశ్రయంలో దాడి జరిగింది. ఓ అగంతకుడు ఈ దాడికి యత్నించాడు. ఓ అజ్ఞాత వ్యక్తి ఎయిర్‌ పోర్టు‌లో వెనుక నుంచి వచ్చి దాడికి ప్రయత్నించాడు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే.. దాడి చేసిన ఆ అజ్ఞాత వ్యక్తిని ఎయిర్‌ పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, వియ్ సేతుపతి తమిళ మాస్టర్ చెఫ్ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. దీని షూటింగ్ నిమిత్తం ఆయన బెంగుళూరుకు వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తి ఈ దాడికి యత్నించాడు.