సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (17:36 IST)

కిక్ కోస‌మే కమల్ హాసన్ పుట్టిన రోజు వేడుకలు

Kamal- FahadFasil
జాతీయ న‌టుడు కమల్ హాసన్ పుట్టిన రోజు వేడుకలను ముందుగానే చేస్తున్నారు. ఆయ‌న పుట్టిన‌రోజు న‌వంబ‌ర్ 7. కాగా, తాజాగా ఆయ‌న `విక్ర‌మ్‌` సినిమాలో న‌టిస్తున్నాడు. షూటింగ్ జ‌రుగుతున్న ఓ మాల్ లో అభిమానుల స‌మ‌క్షంలో ముందుగానే చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసింది. 24 శాఖ‌ల్లోని దాదాపు అన్నింటిలోనూ క‌మ‌ల్‌కు ప‌ట్టు వుంద‌ని ఆ చిత్ర‌యూనిట్ ఈ సంద‌ర్భంగా పేర్కొంది.  
 
Kamal celebrations
ఈ వేడుక‌లో ఫాహద్ ఫజిల్ తోపాటు ప‌లువురు పాల్గొన్నారు. ఇలా ముందుగానే చేయ‌డం వెనుక కార‌ణం ఏమైనా వుందా లేదా సినిమా షూటింగ్‌లో ఇదో భాగ‌మా అనేదానికి క్లారిటీ ఇవ్వ‌లేదు. 'ఉలగనాయగన్   ముందస్తు పుట్టినరోజు వేడుకలను కిక్- కోసం ప్రారంభించామ‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక విక్ర‌మ్ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్, ఆర్. మహీంద్రన్ లు నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లో ఈ సినిమాను విడుద‌ల‌కు సిద్దం చేస్తున్నారు.