గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (18:06 IST)

వర్జిన్ స్టోరి - యువతరానికి నచ్చుతుంది - దర్శకుడు శేఖర్ కమ్ముల

Shekhar Kammula, Lagadapati Sirisha Sridhar, Pradeep
నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా వర్జిన్ స్టోరి. గతంలో రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు విక్రమ్. ప్రస్తుతం ఆయన దిల్ రాజు నిర్మిస్తున్న రౌడీ బాయ్స్ లో కీరోల్ ప్లే చేస్తున్నారు. విక్రమ్ హీరోగా చేస్తున్న తొలి మూవీ `వర్జిన్ స్టోరి`. కొత్తగా రెక్కలొచ్చెనా..అనేది క్యాప్షన్. 
 
రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రదీప్ బి అట్లూరి  దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరో విక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ కార్యక్రమంలో  అతిథిగా పాల్గొని టీజర్ ను విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, శ్రీధర్ గారు నాకు చాలా కాలంగా స్నేహితులు. ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆయనకు సినిమాలంటే ఇష్టం. నేనే కాదు ఎవరు మంచి సినిమా చేసినా ఫోన్ చేసి అభినందిస్తుంటారు. ఫిల్మ్ స్కూల్ లో చదివిన వాళ్లు బయటకొచ్చి యంగ్ టాలెంట్  తో సినిమాలు చేస్తుంటారు. నేనూ అలాగే చేశాను. ఇప్పుడు ప్రదీప్ కూడా కొత్తవాళ్లతో తన తొలి సినిమా చేస్తున్నారు. వర్జిన్ స్టోరి టీజర్, పాటలు చూశాను. చాలా బాగున్నాయి. విక్రమ్  చక్కగా నటించాడు. యూత్ ఆడియెన్స్ కు వర్జిన్ స్టోరి సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాను. సినిమా టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. అన్నారు.
 
లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. నాకు దర్శకుడు శేఖర్ కమ్ముల అంటే చాలా ఇష్టం. ఆయన హ్యాపీడేస్ చిత్రాన్ని నేనే ప్రొడ్యూస్ చేయాల్సింది. కుదరలేదు. గోదావరి సినిమా చూశాక శేఖర్ గారికి సన్మాన సభ పెట్టి సత్కరించాను. ఇవాళ మా అబ్బాయి మూవీ వర్జిన్ స్టోరి టీజర్ రిలీజ్ కు ఆయన రావడం సంతోషంగా ఉంది. వర్జిన్ స్టోరి ఒక నావెల్ స్టోరి. టీ20 సినిమా అని చెప్పొచ్చు. అంటే టీనేజ్ ప్రేక్షకుల నుంచి 20 ఇయర్స్ వరకు ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే చిత్రమిది. ఇవాళ్టి యువత నిజమైన ప్రేమ కోసం వెతుకుతున్నారు. ఒక అమ్మాయి మంచి అబ్బాయి కోసం, అబ్బాయి మంచి అమ్మాయి కోసం, వాళ్ల స్నేహం,  ప్రేమను కోరుకుంటున్నారు. అలాంటి వాళ్లందరి మనసులకు అద్దం పట్టే సినిమా అవుతుంది. యువత మనోభావాలను చూపించే అంశాలన్నింటినీ వర్జిన్ స్టోరి చిత్రంలో చక్కగా చూపించారు  దర్శకుడు ప్రదీప్. త్వరలోనే థియేటర్ లలో మా చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.
 
లగడపాటి శిరీష శ్రీధర్ మాట్లాడుతూ, నిజమైన ప్రేమ దక్కాలంటే వేచి చూడాలి. ఆ సహనం ఉన్న వాళ్లకే అది దక్కుతుందని చెప్పే చిత్రం వర్జిన్ స్టోరి. ఇందులో ఎక్కడా సందేశాలు ఉండవు, చూస్తున్నంతసేపు కంప్లీట్ గా ఎంజాయ్ చేసే సినిమా ఇది. మా అబ్బాయి హీరోగా అరంగేట్రం చేస్తుండటం సంతోషంగా ఉంది. ఒక యూనిక్ కాన్సెప్ట్ మూవీ ఇది. లైఫ్ లో మన చుట్టూ, మనకు తెలిసిన సందర్భాలు ఈ సినిమాలో మీకు కనిపిస్తాయి. థియేటర్లకు వచ్చి మా సినిమాను చూసి బ్లెస్ చేయండి. అన్నారు.
 
దర్శకుడు ప్రదీప్ బి అట్లూరి మాట్లాడుతూ..దర్శకుడు శేఖర్ కమ్ముల గారి సినిమాలు చూసి ఇన్ స్పైర్ అవుతుంటాను. వర్జిన్ స్టోరి సినిమాను నా జీవితంలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించాను. విక్రమ్ లాంటి ప్యాషన్ ఉన్న హీరో నా ఫస్ట్ సినిమాకు దొరకడం అదృష్టం. ప్రతి సీన్ కు సాధన చేసేవాడు. తన పూర్తి ప్రయత్నంతో నటించేవాడు. విక్రమ్ కు హీరోగా మంచి పేరు వస్తుంది. అన్నారు.
 
నటుడు చైతన్య కృష్ణ మాట్లాడుతూ...వర్జిన్ స్టోరి ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరి. మీ లైఫ్ ఇందులో చూసుకుంటారు. విక్రమ్ కు ఆల్ ద బెస్ట్ చెబుతున్నా. నిర్మాత శ్రీధర్ గారికి సినిమాలంటే ప్రాణం. ఆయన మంచి కథలు, కాన్సెప్ట్ లను వదులుకోరు. వర్జిన్ స్టోరి ఆయన నమ్మకాన్ని నిలబెడుతుంది. అన్నారు.