సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (20:03 IST)

"రాజా విక్రమార్క" ట్రైలర్.. నవంబర్ 12న విడుదల (video)

"ఆర్ఎక్స్ 100" చిత్రంతో కార్తికేయ ఎంట్రీ ఇచ్చాడు. ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టి.ఆదిరెడ్డి సమర్పణలో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్‌పై 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. 
 
ఈ చిత్రంలో కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని న్యాచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూనే థ్రిల్ చేసింది.
 
ట్రైలర్ విషయానికొస్తే.. అల్లరిచిల్లరిగా కనిపించే ఎన్ఐఏ ఏజెంట్ అయిన కార్తికేయ హోమ్ మంత్రిని ఒక ప్రమాదం నుంచి కాపాడడానికి సీక్రెట్ మెషిన్ ప్లాన్ చేస్తాడు. ఈ నేపథ్యంలోనే హోమ్ మంత్రి కూతురితోనే ప్రేమలో పడతాడు. 
 
ఇక ఈ మెషిన్‌లోకి శత్రువులు ఎంటరవుతారు. వారిని అడ్డుకొని ఏజెంట్ విక్రమ్ హోమ్ మంత్రిని కాపాడాడా..? హీరోయిన్ ప్రేమను పొందాడా..? అనేది మిగతా కథగా తెలుస్తోంది. ఎన్ఐఏ ఏజెంట్‌గా కార్తికేయ లుక్, బాడీ కట్ అవుట్ అదిరిపోయిందని చెప్పాలి.
 
ఇక ట్రైలర్ ని సగం హ్యూమర్‌తో మిగతా సగం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. సహాయ పాత్రల్లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్, తనికెళ్ళ భరణి, హర్షవర్ధన్ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ కామెడీ అండ్ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ విశేషంగా అలరిస్తోంది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అలరించింది. షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 12న విడుదల కానుంది. మరి ఈ చిత్రంతో కార్తికేయ హిట్ టాక్ ని అందుకుంటాడేమో చూడాలి.