గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 సెప్టెంబరు 2021 (16:47 IST)

ఉప్పెనతో వచ్చిన వైష్ణవ్ తేజ్.. కొండపొలం అంటున్నాడు.. (ట్రైలర్)

Kondapolam Trailer
మెగా మేనల్లుడుగా.. ఉప్పెన సినిమా ద్వారా వెండితెరకు పరిచమ‌య్యాడు హీరో వైష్ణవ తేజ్. త‌న న‌ట‌న‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించడం కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందారు. ఈ చిత్రంలో ఒక మధ్యతరగతి యువకుడిగా వైష్ణవ్ తేజ్ నటనకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ అనూహ్య విజ‌యంతో వైష్ణవ్ తేజ్‌కు సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు పొందిన క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మెగా అల్లుడు వైష్ణ‌వ్ న‌టించ‌నున్నారు. ఈ చిత్రానికి కొండ‌పొలం అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్ర‌ముఖ నవల కొండపొలం ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హాట్ బ్యూటీ రకుల్ ప్రీతి సింగ్ గ్రామీణ ప్రాంతంలో గొర్రెలు కాసే అమ్మాయిగా క‌నిపించ‌నుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్‌ విడుదలైంది.
 
నల్లమల అడవుల చుట్టుపక్కల గ్రామాల్లో వర్షాలు పడకపోవటం వల్ల గొర్రెలకు తినడానికి మేత, తాగటానికి నీరు లేనప్పుడు, వర్షాలు పడేవరకు తమ గొర్రెలని బతికించుకోవడానికి గొర్రెలకాపరులు అడవుల్లోకి వెళ్తారు. ఆ అడవిలో వాళ్ళు ఎదుర్కున్న కష్టాలు ఏంటి, హీరో వాటిని ఎలా ఎదుర్కున్నాడు, హీరోయిన్ తో ప్రేమ కథ, గొర్రెల్ని తినేసే పులితో యుద్ధం.. ఇవన్నీ కలగలిపి ఒక గ్రామీణ అడవి నేపథ్యంలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాని తెరకెక్కించారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ను ఓ లుక్కేయండి.