బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (17:43 IST)

ఇంగువ పొడి కలిపిన నీటిని తాగితే..

Asparagus powder
ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి రాత్రి నిద్రించే ముందు కూడా ఇంగువ పొడి కలిపిన నీటిని తాగాలి. ఇక అలాగే అర గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 చిటికెడు ఇంగువ పౌడర్ కలపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. 
 
యాంటీ-వైరల్ ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల ఉండటం వల్ల. దగ్గు, ఆస్తమా ఇంకా అలాగే బ్రోన్కైటిస్ వంటి వివిధ శ్వాసకోశ సమస్యల చికిత్సలో ఇంగువ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.అలాగే ఇంగువ ఛాతీ బిగుతు నుండి కూడా ఉపశమనం పొందేందుకు బాగా పనిచేస్తుంది.
 
ఇక బీపీని నియంత్రించడానికి ఇంగువలో ఉండే పోషకాలు బాగా పనిచేస్తాయి. ఇవి శరీరంలో రక్తం గడ్డలు ఏర్పడకుండా నిరోధించడంతోపాటు ఇంకా అలాగే రక్తాన్ని పలుచగా చేసి రక్తప్రసరణను కూడా మెరుగుపరుస్తాయి. 
 
ఇక దీనివల్ల హార్ట్ స్ట్రోక్ ప్రమాదం అనేది తగ్గుతుంది. అంతేకాకుండా ఒక చెంచా నీళ్లలో ఇంగువను కరిగించి పొట్ట చుట్టూ కూడా రాసుకుంటే కడుపునొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.