మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (20:46 IST)

ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతిపై దాడి

ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతికి ఊహించని ఘటన ఎదురైంది. బెంగుళూరు ఎయిర్‌పోర్టులో విమానం దిగి బయటకు వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై దాడి చేశాడు.

వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి తన్నాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ఆగంతకుడిని పట్టుకున్నారు. తనపై దాడి చేసిన వ్యక్తిని ఏమీ అనకుండా అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయాడు విజయ్‌.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. స్టార్‌ హీరోపై దాడి చేయడం కరెక్ట్‌ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ దాడికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.