బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (11:35 IST)

ఈ రోజు,రేపు జరగాల్సిన యోగి వేమన విశ్వవిద్యాలయ డిగ్రీ పరీక్షలు వాయిదా

ఈరోజు వైస్సార్ కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా  యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న డిగ్రీ రెండవ సెమిస్టర్ పరీక్షలను రెండు రోజులు వాయిదా వేయడం జరిగిందని పరీక్షల నియంత్రణాధికారి డా.ఈశ్వర రెడ్డి తెలిపారు.

ఈరోజు,రేపు జరగాల్సిన పరీక్షలను  వాయిదా వేస్తున్నామని, వీటిని ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలియజేస్తామన్నారు.

భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య మునగల సూర్యకళావతి, కులసచివులు ఆచార్య డి.విజయరాఘవ ప్రసాద్ లు పరీక్షల వాయిదా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

కళాశాలల ప్రిన్సిపాల్స్ , పరీక్ష నిర్వాహకులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు సమాచారం సమాచారం అందించవలసిందిగా తెలియజేశారు.