బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 11 నవంబరు 2021 (10:22 IST)

ఆన్‌లైన్‌ టికెట్‌ విధానానికి అందరూ అంగీకారం: అంబికా కృష్ణ

ఏపీలో ఆన్ లైన్ సినిమా టికెటింగ్ విధానంపై ఇటీవ‌ల పెద్ద ర‌చ్చే జ‌రిగింది. సీఎం జ‌గ‌న్ ప్ర‌బుత్వం సినిమా టిక్కెట్లు కూడా అమ్ముకుంటోంద‌ని ప్ర‌తిప‌క్షాలు, ఇత‌ర వ‌ర్గాలు విమ‌ర్శ‌లు చేశాయి. అయితే, ఈ ప్ర‌తిపాద‌న వ‌చ్చింది సిని వ‌ర్గాల నుంచే అనేది ప్ర‌భుత్వ వాద‌న‌. దీనిపై క‌నీస ప్ర‌క‌ట‌న కూడా చేయ‌కుండా, సినీ పెద్ద‌లు ముత్త‌యిదువుల్లా గ‌మ్మున కూర్చోవ‌డం వైసీపీ ప్ర‌భుత్వానికి ఒకింత ఆగ్ర‌హాన్ని క‌లిగించింది. అందుకే సిని వ‌ర్గాల‌తో భేటీల‌కు సీఎం ఫుల్ స్టాప్ పెట్టేశార‌ని చెపుతున్నారు. 


అయితే, తాజాగా ఇపుడు సినీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మ‌రోసారి చ‌ర్చించారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల థియేటర్ల యజమానులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం, సినిమాటోగ్రఫీ చట్టంలోని సవరణలపై చర్చ జరిపారు. అన్ని సినిమాలపై టికెట్‌ ధర ఒకే విధంగా ఉండేలా కొత్త విధానం, థియేటర్ల సమస్యలపైన సమావేశంలో చర్చించారు.
 
 
ఆన్‌లైన్‌ టికెట్‌ విధానానికి అందరూ  నిర్మాత‌, సినీమా హాల్ అధినేత‌ అంబికా కృష్ణ తెలిపారు. చిన్న ఊర్లలోని థియేటర్లలో గ్రేడింగ్‌ సిస్టమ్‌ పెట్టాలని థియేటర్‌ యజమానులకు మంత్రి పేర్ని నాని సూచించారని ఆయన తెలిపారు.