బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 9 నవంబరు 2021 (16:46 IST)

దేశం, ప్ర‌పంచం... రాహుల్ నాయకత్వాన్ని కోరుకుంటోంది.... కేవీపీ

భార‌త‌దేశానికి ఇపుడు దిక్సూచి లేద‌ని, అది భార‌త ప్ర‌ధానిగా రాహుల్ గాంధీ వ‌చ్చిన త‌ర్వాతే అని కాంగ్రెస్ నాయ‌కుడు,  మాజీ రాజ్య సభ సభ్యులు కే వీ పీ రామచంద్రరావు అన్నారు.  భారతదేశం తో పాటు ప్రపంచమంతా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని కే వీ పీ రామచంద్రరావు అన్నారు. విజ‌య‌వాడ‌లోని ఆంధ్ర ర‌త్న భ‌వ‌న్లో కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంలో కేవీపీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, దేశంలో ఇపుడున్న మోదీ ప్ర‌భుత్వం పోయి, కాంగ్రెస్ ప్ర‌భుత్వం రావాల‌న్నారు.
 


కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. నిరంకుశ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలను ప్రజలకు వివరిద్దామని పిలుపునిచ్చారు. యువతలో అభ్యుదయ భావాలు ఉన్నందున సమిష్టిగా ముందుకు సాగుదాం అన్నారు. ప్రజలందరినీ కూడగట్టుకుని  యు పి ఏ హయాంలో తీసుకువచ్చిన పథకాలను అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. విశాఖ ఉక్కును స్వప్రయోజనాలకోసం అమ్ముకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.