శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (11:32 IST)

24 గంట‌ల‌లోపు చైన్ స్నాచ‌ర్ అరెస్టు

గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలోని పండ‌రీపురం 8వ లైనులో ఈ నెల 8వ తేదీన సోమ‌వారం న‌డుచుకుంటూ వెళుతున్న అంబ‌డిపూడి శార‌ద అనే మ‌హిళ మెడ‌లోని 3 స‌వ‌ర్ల బంగారు గొలుసును ద్విచ‌క్ర‌వాహ‌నంపై వ‌చ్చిన దుండ‌గుడు లాక్కొని ప‌రారయ్యాడు.

ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న అర్బ‌న్ సీఐ రాజేశ్వ‌ర‌రావు 24 గంట‌ల‌లోపే ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలోని సంజీవ‌న‌గ‌ర్‌కు చెందిన బ‌త్తుల నాగేంద్ర‌బాబును అరెస్టు చేశారు. అత‌ని వ‌ద్ద నుంచి 3 స‌వ‌ర్ల బంగారు గొలుసు రిక‌వ‌రీ చేశారు.

ద్విచ‌క్ర‌వాహ‌నం సీజ్ చేశారు. నాగేంద్ర‌బాబు పెయింట్ ప‌ని చేస్తుంటాడు. అప్పుల పాల‌వ్వ‌డంతో దొంగ‌త‌నానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. కేసును త్వ‌రిత‌గ‌తిన చేధించిన అర్బ‌న్ ఎస్ ఐ ఫిరోజ్‌ను సీఐ రాజేశ్వ‌ర‌రావు అభినందించారు.