కుప్పంలో ఉద్రిక్తత : మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అరెస్టు.. ఖాకీల వార్నింగ్
చిత్తరు జిల్లాలోని కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఘర్షణ వాతావరణం చేసుకుంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిని కూడా పోటీసులు అరెస్ట్ చేశారు. అమర్నాథ్ రెడ్డి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పోలీసులు ఆయన్ను అరెస్టు జిల్లా దాటించారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు జిల్లాలో అడుగుపెట్టరాదని పోలీసులు హెచ్చరించారు.
కుప్పంలో నామినేషన్స్ సందర్భంగా వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. మొత్తం 19 మంది పై పోలీసులు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇందులో ఇద్దరినీ మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ 143, 147,353, 427,149 సెక్షన్స్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ వివాదంపై మంగళవారం డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఇతర జిల్లాలవారి కారణంగానే గొడవలు జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమీషనర్ చిట్టిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే అమర్నాథ్ రెడ్డిని, పులివర్తి నానిని అరెస్ట్ చేశారు. దాంతో పోలీస్ స్టేషన్ ముందు తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళనకు దిగారు.