1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. During Gaddar Telangana Film Awards event, Allu Arjun told a popular dialogue from Pushpa-2 in front of CM Revanth Reddy

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Allu Arjun
Allu Arjun
ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ 'పుష్ప-2' సినిమాలో కనబరిచిన అద్భుతమైన నటనకు గాను ఉత్తమ నటుడిగా తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన స్వీకరించారు. 
 
హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరై, చలనచిత్ర రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన పలువురు కళాకారులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేశారు. 
 
అవార్డు స్వీకరించిన అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఉత్తమ నటుడిగా గద్దర్ ఫిల్మ్ అవార్డును అందుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాన్ని తన అభిమానులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. 
 
ఇంకా మాట్లాడుతూ, ఇది సినిమా అవార్డు వేడుక కాబట్టి సినిమాలో నుంచి ఒక డైలాగ్ చెబుతానంటూ, ముఖ్యమంత్రి, ఇతర పెద్దల అనుమతి కోసం వారి వైపు చూశారు. అందుకు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి "గో ఎహెడ్" అంటూ వెంటనే అంగీకరించారు. దీంతో అల్లు అర్జున్ "నా బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా..." అనే డైలాగ్ చెప్పారు. చివరలో జై తెలంగాణ, జై హింద్ అంటూ ముగించారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?