1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Will Deepika Padukone's choice spark a rift between Allu Arjun and Prabhas?

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Prabhas - Allu Arjun
Prabhas - Allu Arjun
గత కొద్దిరోజులుగా  బాలీవుడ్ నటి దీపికా పదుకొనె జాతీయస్థాయిలో పెద్ద చర్చగా మారింది. సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న స్పిరిట్ సినిమాలో ఆమెకూ, దర్శకుడికీ మధ్య మాటలవార్ తో తప్పుకుంది. ఆ తర్వాత ప్రభాస్ తో నటించనని తేల్చిచెప్పడంతో మరింత హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ తో లిప్ లాక్ చేయడానికి నేను ఇష్టపడలేదంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ స్టేట్ మెంట్ తర్వాత టాలీవుడ్ కు కావాల్సిన స్టఫ్ దొరికింది. దానిపై రకరకాలుగా కథనాలు వచ్చేశాయి. ఈ క్రేజ్ ను ఆసరాగా తీసుకుని నేడు అల్లు అర్జున్ సినిమాలో దీపికా ఎంపిక చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు.
 
Deepika Padukone
Deepika Padukone
ఒక తెలుగు హీరో, తమిళ దర్శకుడు, బాలీవుడ్ భామ మధ్య పెద్ద ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తూ ఆకస్తికర అంశాలు తెలియజేస్తున్నారు. ప్రభాస్ తో లిప్ లాక్ చేయనని బహిరంగ ప్రకటన చేసిన దీపికా పదుకొనె ఇప్పుడు అల్లు అర్జున్ తో అంతకుమించి రొమాన్స్ చేయడానికి సిద్ధమయిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నారు. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా మధ్య జరిగిన రొమాన్స్ ఓ రేంజ్ లో వుంది. మరి తప్పనిసరిగా  పాన్ ఇండియామూవీ కాబట్టి అల్లు అర్జున్ తో అంతకుమించి చేస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో దీపికా బాలీవుడ్ హీరోలతో చేసిన రొమాన్స్ రచ్చ మామూలుగా లేదు. క్లబ్ డాన్సర్ కు మించిన పెర్ ఫార్మెన్స్ చూపించింది. కాగా, ప్రస్తుతం అట్లీ సినిమాలో ఈమె ఎంపిక అటు అల్లు అర్జున్, ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు రగిల్చేదిగా వుంది.
 
ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కామెంట్లు చేస్తున్నారు. ఫిలింనగర్ లో అయితే ఓ రేంజ్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అల్లు అర్జున్ ఇంకా మారలేదనీ, దూకుడు స్వభాగం మరింత ఎక్కువైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిని బట్టి సలార్ 2 లో దీపిక వుండదనేది స్పష్టం అవుతోంది.
 
ఒకప్పుడు ఏ హీరో సినిమాలోనైనా హీరోయిన్ ను వద్దనుకుంటే కొంతకాలం ఆ హీరోయిన్ తో సినిమా అవకాశాలు రావు. రాత్రికి రాత్రే హీరోయిన్లను మార్చేసిన సందర్భాలున్నాయి. అక్కినేని, జమున, ఎన్.టి.ఆర్. కాలం నుంచి విజయశాంతి కాలంవరకూ ఇలా ఎన్నో ఉదంతాలు వున్నాయి. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎవరైతే కాంట్రవర్సీతో పాపులర్ అవుతారో వారినే ఎంపికచేసుకోవడం పరిపాటిగా మారింది. ఇటువంటి ప్రక్రియ మంచి వరకు అయితే బాగుంటుంది. లేదంటే.. హీరోల మధ్య, ఫ్యాన్స్ మధ్య వార్ మొదలయ్యే అవకాశంలేకపోలేదని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి.
 
ఇప్పటికే బాలీవుడ్ అంతా సందీప్ రెడ్డి వంగా వైపే వున్నారనీ నిన్ననే కథనాలు కూడా ప్రచారంజరిగాయి. అలాంటిది ఆమెకు అక్కడ అవకాశాలులేకపోవడంతో దక్షిణాదివైపు వచ్చిందా? అందుకు ఎవరు కారకులు? దీపిక ఎంపిక విషయంలో అసలు ఏమి జరిగింది? అల్లు అర్జున్ కావాలనే తీసుకున్నాడా? అనేది కూడా త్వరలో తెలియనుంది. ఇక, దర్శకుడు అట్లీ, నిర్మాణ సంస్థ  అయితే దీపిక రాకతో మాలో ఉత్సాహం ఉప్పొంగింది. బిజినెస్ పరంగా హైప్ క్రియేట్ అయిందని నిస్సంకోశంగా ప్రకటన విడుదల చేశారు. ముందు ముందు ఈ వివాదం ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాలి.
About Writer
దేవీ
తర్వాతి కథనం
ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి