సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (14:57 IST)

పేకాట కేసులో : హీరో నాగశౌర్య తండ్రి అరెస్టు

హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మంచిరేవుల పేకాట కేసులో టాలీవుడ్ హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్‌‌ను నార్శింగ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను ఉప్పర్‌పల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.
 
క్యాసినో కింగ్‌పిన్‌ గుత్తా సుమన్‌తో కలిసి శివలింగప్రసాద్‌ పేకాట దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. కాగా శివలింగప్రసాద్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ అరెస్టుతో ఈ ఫామ్‌ హౌస్ పేకాట కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటివరకు ఈ కేసులో గుత్తా సుమనే కింగ్‌పిన్ అనుకుంటే మరో కీలక వ్యక్తి తెరపైకి వచ్చాడు. ఈ పేకాట దందాలో హీరో నాగశౌర్య ఫాదర్ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.