1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (10:08 IST)

పూనమ్ పాండేపై భర్త దాడి.. ఆస్పత్రిలో అడ్మిట్

బాలీవుడ్ సెక్సీబాంబ్ పూనమ్ పాండేపై ఆమె భర్త సామ్ బాంబే విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడిన పూనమ్.. ప్రస్తుతం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. అదేసమయంలో ఈ కేసులో సామ్ అహ్మద్ బాంబే అరెస్ట్ అయ్యారు. పూనమ్ పాండే తన భర్తపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
 
పూనమ్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, సామ్ తన మొదటి భార్య అల్విరాతో మాట్లాడడంతో గొడవ జరిగింది. దీంతో సామ్‌కి కోపం వచ్చింది. కోపంతో పూనమ్ పాండే జుట్టు పట్టుకుని తలను గోడకు కొట్టాడు. అంతేకాకుండా పూనమ్ ముఖంపై కొట్టాడు. 
 
ఈ దాడిలో పూనమ్ పాండే ఒక కన్ను, ఆమె ముఖంపై తీవ్ర గాయమైంది. పూనమ్ పాండే ఈ ఫిర్యాదు చేశాక బాంద్రా పోలీస్ స్టేషన్‌లోని పోలీసులు అతనిపై చర్యలు తీసుకున్నారు. వెంటనే సామ్‌ను అరెస్టు చేశారు. 
 
బాంద్రా పోలీసులు ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. కాగా ముంబై పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు పూనమ్ పాండే ఆస్పత్రిలో చేరింది. అయితే పూనమ్ పాండే గాయానికి సంబంధించి ముంబై పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.