ములుగు జిల్లా.. ఉద్యోగి భుజంపై ఎక్కి కూర్చుని హాయిగా నిద్రపోయిన వానరం (video)  
                                       
                  
                  				  ములుగు జిల్లాలో ఓ ఉద్యోగి తలపై హాయిగా నిద్రపోయింది. వానరం అలా కునుకు తీయడంతో ఉద్యోగి కూడా కదలక మెదలక వుండిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లాలో ఏటూరునాగారంలోని గిరిజన ఆవాస పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో ఉద్యోగులు తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలో ఓ వానరం కార్యాలయంలోపలికి వచ్చింది. దాన్ని చూశాక ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. 
 				  											
																													
									  
	 
	అయితే ఉద్యోగి మహ్మద్ సాధిక్ మాత్రం నెమ్మదిగా దాన్ని దగ్గరికి తీసుకున్నాడు. ఏం కావాలని అడిగాడు. అంతే ఆ ఉద్యోగికి అది దగ్గరైంది. వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి భుజాలపైకెక్కింది.
				  
	 
	ఆయన తలపై వాలిపోయి హాయిగా కునుకు తీసింది. సాధిక్ కూడా కదలకుండా అలాగే ఉండిపోయారు. మిగిలిన ఉద్యోగులు తమ పని తాము చేసుకుంటూ వుండిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.