గర్భవతిని చేసి బిడ్డ పుట్టాక రెండో పెళ్లి -ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా  
                                       
                  
                  				  నల్గొండ జిల్లాలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలో రేణుక అనే యువతి.. అదే గ్రామానికి చెందిన వ్యక్తిని ప్రేమించింది. 
				  											
																													
									  
	 
	అతడు ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేశాడు. చివరికి గర్భం దాల్చిన రేణుక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత తనను పట్టించుకోకుండా అతడు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని రేణుక తెలిపింది. 
				  
	 
	తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. అతడింటి ముందు శనివారం ధర్నాకు దిగింది. దీంతో గ్రామ పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకుని పంచాయితీ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులకు ఇంకా బాధితురాలు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.